సొంత బావతోనే అక్రమ సంబంధం …అది చూసిన అన్నలు – Dharuvu
Breaking News
Home / CRIME / సొంత బావతోనే అక్రమ సంబంధం …అది చూసిన అన్నలు

సొంత బావతోనే అక్రమ సంబంధం …అది చూసిన అన్నలు

దేశం మొత్తం అత్యంతా దారుణంగా అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబందం చేసె వారిని, చేస్తున్నా వారిని అత్యంతా దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా సొంత బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పరువు కోసం ఓ యువతిని ఆమె కుటుంబసభ్యులే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. షామ్లీ జిల్లా ముందేట్ కాలా గ్రామానికి చెందిన సత్యవతి అనే 24 ఏళ్ల యువతి తన బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. కూతురు అక్రమ సంబంధం వల్ల తమ కుటుంబ పరువు పోతుందని భావించిన తండ్రి తన కొడుకుతో కలిసి కూతురైన సత్యవతిని కత్తితో దారుణంగా పొడిచి చంపేసి మృతదేహాన్ని పొలాల్లో పడేశాడు. తమ కుటుంబ ప్రతిష్ఠను కాపాడేందుకే తాము సత్యవతిని హతమార్చామని సత్యవతి తండ్రి, సోదరులు చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి కారుతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి వివరాలు తెలియాజేస్తామని చెప్పారు.