ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ ..! – Dharuvu
Breaking News
Home / TECHNOLOGY / ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ ..!

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ ..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ యూజర్లకు మరో ఫీచర్‌ను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ట్వీట్లలో క్యారెక్టర్స్ లిమిట్‌ను 140 నుంచి 280కి పెంచిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు ట్విట్టర్‌లో పెట్టుకునే డిస్‌ప్లే పేర్లకు గాను క్యారెక్టర్ లిమిట్‌ను కూడా ట్విట్టర్ పెంచింది. ఇప్పటి వరకు ఈ లిమిట్ 20 అక్షరాలు మాత్రమే ఉండగా, ఇక నుంచి యూజర్లు తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల లిమిట్ వరకు పెట్టుకోవచ్చు. అందులో ఎమోజీలు, ఇతర లెటర్స్‌ను కూడా యూజర్లు పెట్టుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది. అయితే ట్విట్టర్‌లో ఉండే డిస్‌ప్లే నేమ్, యూజర్ నేమ్ వేర్వేరు కనుక ప్రస్తుతం ఈ ఫీచర్ డిస్‌ప్లే నేమ్‌కే వర్తిస్తుంది.