మీకు చుండ్రు ఉందా ..అయితే ఇలా చేయండి ..! – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / మీకు చుండ్రు ఉందా ..అయితే ఇలా చేయండి ..!

మీకు చుండ్రు ఉందా ..అయితే ఇలా చేయండి ..!

ప్రస్తుత రోజుల్లో స‌హ‌జంగా అందరికి కాకపోయిన చాలా మందికి చుండ్రు స‌మ‌స్య ఉంటుంది. మరి చలికాలంలో ఎక్కువగా చుండ్రు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది .అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే చుండ్రు నుండి ఉపసమనం లభిస్తుంది .అయితే ఆ చిట్కాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం . అందులో భాగంగా మన జుట్టుకు వేడి చేసిన నూనెతో మసాజ్ చేస్తూ చుండ్రును అరికట్టవచ్చు .అంతే కాకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఏదైనా హెయిర్ ఆయిల్ ను వేడిచేసి జుట్టుకు పట్టించాలి .

ఉదయం లేవగానే తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి .ఇలా మూడు సార్లు వారంలో చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది .మన ఇంట్లో సహజంగా దొరికే అరకప్పు పెరుగులో ఐదు టీ స్పూన్ల నిమ్మరసం కల్పి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి సరిగ్గా ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి .ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది .

సర్వరోగ నివారిణి కొన్ని వేపాకులను రుబ్బి ఆ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కల్పి జుట్టుకు రాసుకొని ఇరవై ఐదు నిమిషాలు పాటు సాధారణ నీటితో కడగాలి .ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి .ఇక ప్రకృతి సంబంధమైన కలబంద ఆకుల నుండి తాజా జెల్ ను తీసుకొని మరి తలకు రాసుకొని ఒక అర్ధగంట తర్వాత మేడికేటేడ్ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు నుండి విముక్తి లభిస్తుంది .ఇక వెల్లుల్లి పాయల్ని తీసుకొని బాగా ఫెస్ట్ లా చేసి అందులో టీ స్పూన్ తేనె కల్పి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అర్ధగంట తర్వాత తలస్నానం చేయించాలి .ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు నుండి విముక్తి లభిస్తుంది .