మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌ – Dharuvu
Breaking News
Home / NATIONAL / మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌

హిమాచల్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలాంషు చతుర్వేది బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ త్రిపాఠిపై 14,100 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ప్రేమ్‌ సింగ్‌ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కౌంటింగ్‌లో తొలి రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చతుర్వేది బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధిస్తూ వచ్చారు. పార్టీ అభ్యర్థి ఘనవిజయంతో కాంగ్రెస్‌ శ్రేణులు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయం వద్ద సంబరాల్లో మునిగితేలాయి.