Breaking News
Home / LIFE STYLE / చ‌లికాలంలో ఆలివ్ ఆయిల్ ను మ‌రువ‌కండి..!

చ‌లికాలంలో ఆలివ్ ఆయిల్ ను మ‌రువ‌కండి..!

సాధారణంగా మనం వాడె ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌నే ఉంటుంది . కానీ అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను కూడా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా చ‌లికాలంలో ఆలివ్ ఆయిల్‌ను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధనా చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు.

2. చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే, చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై పుండ్లు గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మం సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది.

3. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి శరీరానికి మసాజ్‌ చేస్తే వారి చర్మం మృదువుగా ఉండి అందంగా తయారవుతారు. పీలగా ఉన్న పాపాయిలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే బొద్దుగా అందంగా అవుతారు.

4. ఆలివ్‌ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాసుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.

5. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి.

6. ఒక టీస్పూన్ గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండు టీస్పూన్ల‌ ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

7. నాలుగు చుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.

8. ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

9. ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.

10. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి. ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.

11. పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.

12. చలికాలంలో ఆలివ్‌ఆయిల్‌ను పెదాలకు రాస్తూంటే పెదాలు పగలకుండా మృదువుగా వుంటాయి. ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.