క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది .. – Dharuvu
Breaking News
Home / POLITICS / క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ..

క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో జరిగిన కబడ్డీ ఆటల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు .ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులు అవార్డులను ,పతకాలను సాధించాలని ఆకాంక్షించారు .

రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజక వర్గంలో ప్రతిగ్రామ స్పోర్ట్స్ విలేజ్ ,ప్రతిపట్టణంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ -ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలకు ప్రభుత్వం కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తుంది అన్నారు .క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఆయన హామిచ్చారు .అనంతరం మంత్రి అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాష్ట్ర స్థాయి పాఠశాల స్థాయి క్రీడా కబడ్డీ పోటీల్లో గెలుపొందిన జిల్లా క్రీడాకారులకు మెమెంటోలు అందించారు .