18న వ‌రంగ‌ల్‌కు మంత్రి కేటీఆర్‌..ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం – Dharuvu
Breaking News
Home / SLIDER / 18న వ‌రంగ‌ల్‌కు మంత్రి కేటీఆర్‌..ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం

18న వ‌రంగ‌ల్‌కు మంత్రి కేటీఆర్‌..ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీ‌కారం

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత రెండో ప్రాధాన్య న‌గ‌రంగా గుర్తింపును సాధించుకోవ‌డ‌మే కాకుండా గౌర‌వాన్ని పొందుతున్న వ‌రంగ‌ల్ మ‌రో విశిష్ట కార్య‌క్ర‌మానికి వేదిక‌గా మార‌నుంది. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని రాష్ట్ర చేనేత‌, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 18న వరంగల్‌లో ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టింది. నూతనంగా యార్న్‌ సబ్సిడీ పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈనెల 18న వరంగల్‌ మహానగర పాలక సంస్థలో అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించేందుకు జిల్లాకు వస్తున్న మంత్రి కేటీఆర్‌ నేతన్నల కోసం ప్రవేశపెట్టిన ఈపథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారాచేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. చేనేత సహకారసంఘంలోని సోసైటీలు, కార్మికులు కొనుగోలుచేసే నూలు, సిల్క్‌, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతానికి పెంచనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పది శాతం సబ్సిడీ కూడా ఎప్పటిలాగే లభిస్తోంది. ఈ పథకంలో చేనేత, అనుబంధ కార్మికులకు 35 శాతం అదనపు ఆదాయం లభిస్తోందని సహకారసం ఘాలకు ఐదు శాతం ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నా రు. కొత్తగా ప్రవేశపెట్టే పథకం కోసం రాష్ట్ర ప్ర భుత్వం రూ.100 కోట్లకు కేటాయించింది. కార్యక్రమం ద్వారా రాష్ట్రం లోని సుమారు 35 వేల మంది చేనేత కార్మికుల కు లబ్ధి చేకూరుతుందని చేనేత వర్గాలు తెలిపాయి.