అన్న‌పూర్ణ స్టూడియో.. అగ్నిప్రమాదానికి అస‌లు కారణం ఇదే..! – Dharuvu
Breaking News
Home / MOVIES / అన్న‌పూర్ణ స్టూడియో.. అగ్నిప్రమాదానికి అస‌లు కారణం ఇదే..!

అన్న‌పూర్ణ స్టూడియో.. అగ్నిప్రమాదానికి అస‌లు కారణం ఇదే..!

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగ‌తి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం ఫై హీరో నాగార్జున స్పందించారు. షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల వలన షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయని.. ప్రమాద తీవ్రత తక్కువగానే ఉన్న సమయంలో అక్కడున్నవారంతా సురక్షితంగా బయటకు వచ్చేసారని చెప్పారు. మంటలు క్రమంగా పెద్దవి కావడంతో అక్కడున్న మనం చిత్రానికి సంబంధించిన సెట్ పూర్తిగా ధ్వంసం అయ్యింద‌ని చెప్పారు. ఇక నాన్నగారి గుర్తుగా ఈ సెట్‌ను అలాగే ఉంచుతున్నామని అయితే ఆయనే లేనప్పుడు సెట్ కాలిపోవడం పెద్ద విషయం కాదన్నారు.

అయితే ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి అస‌లు కార‌ణం మాత్రం మా సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే అని తేల్చి చెప్పారు. అప్ప‌ట్లో ఆ సెట్ట‌ను నిర్మించ‌డానికి 2 కోట్ల వరకూ ఖర్చు అయిందని.. ఇటీవల చాలా చిత్రాలు ఆ సెట్‌లో చిత్రీకరణ జరుపుకున్నాయని.. సమంత, తాను కలిసి నటించిన రాజు గారి గది-2 మూవీలో కొన్ని సీన్లు ఇదే సెట్‌లో చిత్రీకరించామన్నారు. సోలార్ పవర్‌కు సంబందించిన పరికరాలకు కూడా మంటలు అంటుకుని పూర్తిగా పాడైపోయినట్లు సమాచారం. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ రూ కోటికి పైగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియో నిత్యం సినిమా సంబందించిన కార్యకలాపాలు, షూటింగులతో బిజీగా ఉంటుంది.