నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..!

నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తొలి మైలురాయిని అధిగ‌మించింది. ఇక జ‌గ‌న్ ప్రారంబించిన పాద‌యాత్ర ఎనిమిద‌వ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీట‌ర్లు దాటింది. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌య‌త్ర క‌ర్నూలుకి చేరింది. క‌ర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజ‌క వ‌ర్గమైన ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ జంక్ష‌న్‌లో జ‌రిగిన స‌భ‌లో దుమ్మురేపారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో జనం అడుగడుగునా జగన్‌కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అఖిల ప్రియ పైనా చంద్ర‌బాబు స‌ర్కార్ పైన ద్వ‌జ‌మెత్తారు.

ఇక జ‌గ‌న్ ప్ర‌సంగం త‌ర్వాత అక్క‌డి మ‌హిళ‌లు త‌మ ఆవేద‌న‌ని తెలియజేశారు. ఒక మ‌హిళ మాట్లాడుతూ.. జ‌గ‌న్ సారు మా నాన్న‌కి ముగ్గురు కూతుళ్ళ‌మ‌ని.. అయితే త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చ‌క్క‌గా ఉండే వాడ‌ని.. మా ముగ్గురుని బాగా చూసుకునే వాడ‌ని.. కానీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక తాగి తంద‌నాలు ఆడుతున్నాడ‌ని చెప్పి ఒక్క‌సారిగా అక్క‌డున్నవారికి షాక్ ఇచ్చింది. మ‌రో మ‌హిళ మాట్లాడుతూ చంద్ర‌బాబు పాల‌న‌లో గ్రామాల‌న్నీ మ‌త్తులో మునిగిపోతున్నాయ‌ని.. అనేక కుటుంబాలు నాశ‌నం అవుతున్నాయ‌ని చెప్పింది. దీంతో చంద్ర‌బాబు ధ‌న దాహానికి.. అమాయ‌క ప్ర‌జ‌ల్ని మ‌ధ్యం మ‌త్తులో ముంచుతున్నార‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ పై స‌ర్వ‌త్రా ఫైర్ అవుతున్నారు.