Home / MOVIES / మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీగా..

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీగా..

తెలుగు సినీ ఇండస్ట్రీని మకుటం లేని మహారాజులా ఏలిన మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల విరామం తర్వాత నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ కు కమ్ బ్యాక్ మూవీగా, ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా 2017 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచి, మెగాస్టార్ స్టామినాను మరోసారి అందరికీ గుర్తుచేసింది.

2008లో రాజకీయ రంగప్రవేశం చేసిన మెగాస్టార్, ఆ తర్వాత మేకప్ వేసుకోలేదు. ఫ్యాన్స్ ఎన్నిసార్లు అడిగినా, అమితాబ్, రజనీకాంత్ లాంటి వాళ్లు రిక్వెస్ట్ చేసినా, ఆయన సినిమాల్లో నటించలేదు. అయితే మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు ఎట్టకేలకు 2016లో ఫలించాయి. చిరు మనసు మార్చుకున్నారని, మళ్లీ సినిమాల్లోకి రావడానికి కథలు వింటున్నారన్న వార్తలు ఆ ఏడాది హల్ చల్ చేశాయి. పూరీ జగన్నాథ్ తో చేస్తున్నారని కథలో మార్పులున్నాయని సినీవర్గాల్లో టాక్ నడిచింది. అయితే చివరికి మెగాస్టార్, తమిళ సూపర్ హిట్ కత్తిని రీమేక్ గా ఎంచుకున్నారు. మంచి సామాజిక కథాంశం, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా అయితేనే, తన కమ్ బ్యాక్ కు కరెక్ట్ అని ఆయన భావించారు. వివి వినాయక్ దర్శకత్వంలో, రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి ఈ సినిమాను నిర్మించాడు. మూవీ మేకింగ్ సమయంలో రిలీజైన ఒక్కో స్టిల్ ఒక్కో సంచలనంగా మారేది. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసేవారు.

జనవరి 11 న విడుదలైన ఖైదీ నెంబర్ 150, అంచనాలకు తగ్గట్టు రాణించింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి, మెగాస్టార్ కి ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్కమ్ పలికింది. పరుచూరి బ్రదర్స్ మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, వి.వి.వినాయక్ దర్శకత్వం, వీటన్నింటికీ మించి మెగాస్టార్ మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ తెలుగు ప్రేక్షకుల్ని కట్టేపడేశాయి. తమిళంలో సూపర్ హిట్టైనా, కథ అందరికీ తెలిసిందే అయినా, సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నాన్ బాహుబలి రికార్డులకు చేరువైంది. ఇక ఇప్పటి వరకూ చిరు సినిమాలేవీ ఓవర్సీస్ లో విడుదల కాలేదు. ఖైదీ నెంబర్ 150 తోనే ఓవర్సీస్ లో అడుగుపెట్టిన మెగాస్టార్, అక్కడ కూడా బాక్సాఫీస్ ను కొల్లగొట్టేశారు.

ఊరి కోసం తపన పడే ఒక వ్యక్తిగా, అల్లరిచిల్లరగా తిరిగే దొంగగా రెండు పాత్రల్లో మెగాస్టార్ ఒదిగిపోయారు. కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ లో, హృదయాలను కదిలించే క్లైమాక్స్ సీన్లలో మెగాస్టార్ తన అనుభవాన్నంతా కలిపి నటించారు. డ్యాన్సుల విషయంలో మెగాస్టార్ కు పేరుపెట్టేది ఏముంది. తనకు అలవాటైన రీతిలో అలవోకగా స్టెప్స్ వేసేసి అభిమానుల్ని అలరించారు. ఒక రకంగా, ఆయన డాన్స్ ల వల్లే ఖైదీ నెంబర్ 150 సినిమా పాటలు అంతలా హిట్ అయ్యాయంటే ఆశ్చర్యం లేదు. సినిమాలో అన్నింటికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది చిరంజీవి లుక్స్. ఆరుపదుల్లో ఉన్న మెగాస్టార్, అందులో సగం వయసున్న వాడిలా కనిపించారు. సినిమాకు వెళ్లిన వారికి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ చిరంజీవే.

ఆయన ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు, ఖైదీ నెంబర్ 150 మంచి ట్రీట్ గా నిలిచింది. అందుకే తెలుగు సినిమా అభిమానులు కూడా ఈ సినిమాకు ఘన విజయాన్ని కట్టబెట్టి, 2017లో టాప్ ఫైవ్ మూవీస్ లో కూర్చోబెట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat