దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం .. – Dharuvu
Breaking News
Home / POLITICS / దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..

దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో  విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు ప్రతి రోజు విద్యార్ధులకు అందించాల్సిన కాయగూరల మెనూను విడుదల చేశారు.

దళితుల పట్ల ముఖ్యమంత్రి  కేసీఆర్  కున్న ధార్శినికతకు ఈ పధకం అద్దం పడుతుందని అయన చెప్పారు.ప్రతి ఆదివారం రోజున విద్యార్ధులందరికీ కోడికూరతో కూడిన బోజనం అందించడంతో పాటు మిగితా వారం రోజులు తప్పని సరిగా కోడిగుడ్డు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు అయన తేలిపారు.అంతే గాకుండ పోషకాలతో కూడిన కాయగూరలతో బోజనం అందించేలా మెనూను రూపొందించడం జరిగిందని అయన తేలిపారు.ఒక తరాన్ని విద్యా పరంగా అభివృద్దిలోకి తీసుక రావడం ద్వార దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారిలో వెలుగులు నింపోచ్చన్న బావనతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పధకం ప్రవేశ పెట్టడం జరిగిందని అయన కొనియాడారు.

విధ్యార్దులలో శారీరకసౌష్టవం పెంపొందింప చెయ్యడంతో పాటు మేధాశక్తిని ఇనుమడింప చెయ్యడానికి ముఖ్యమంత్రి కేసీఆర్  చేపట్టిన సంక్షేమ పధకాలలో యస్.సి విధ్యార్ధులకోసం చేపట్టిన ఈ పధకం అభినందనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలు చివరి అంచు చేరేవరకు, ముఖ్యమంత్రి కెసియార్ అలోచనలను ఆచరణలో పెట్టేందుకు అధికారులు కృషి  చెయ్యాలని అయన కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో  అజయ్ మిశ్రా, జి.హెచ్.యం.సి కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ  డైరెక్టర్ కరుణాకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు