గుజ‌రాత్ డ‌ర్టీపాలిటిక్స్‌.. హార్ధిక్ ప‌టేల్‌ వీడియో లీక్‌..? – Dharuvu
Breaking News
Home / NATIONAL / గుజ‌రాత్ డ‌ర్టీపాలిటిక్స్‌.. హార్ధిక్ ప‌టేల్‌ వీడియో లీక్‌..?

గుజ‌రాత్ డ‌ర్టీపాలిటిక్స్‌.. హార్ధిక్ ప‌టేల్‌ వీడియో లీక్‌..?

గుజరాత్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యాన ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్‌కి షాక్ త‌గిలిందా.. ఓ హోట‌ల్ గ‌దిలో అమ్మాయితో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్న ఈ వీడియో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేపుతోంది. సీడీలో వున్నది హార్ధిక్‌ తరహాలోవున్న వ్యక్తి ఓ మహిళతో క్లోజ్‌గా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే మోడీ టీమ్‌ను ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ప‌టేల్ ఈ లీక్‌డ్ వీడియోతో బీజేపీకి త‌లొగ్గుతాడా..గుజ‌రాత్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌లో ఈ వీడియో రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇక ఈ వీడియో పై హార్ధిక్ ప‌టేల్ స్పందించారు. ఆ వీడియో త‌న‌ది కాద‌ని.. దీన్ని ఇత‌ర దేశాల నుండి అప్‌లోడ్ చేశార‌ని.. న‌న్ను రాజ‌కీయంగా ఎదుర్కొన లేకే నాపై ఇలాంటి కుట్ర‌ల‌కు తెర‌లేపింద‌ని.. అదొక ఫేక్ వీడియో అని స్ప‌ష్టం చేశారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను నపుంసకుడిని కాదని బీజేపీ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోంద‌ని.. మార్ఫింగ్‌తో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్ర తనపై జరుగుతుందని గతంలోనే తెలిపానని గుర్తు చేశారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తుందని ఫైర్‌ అ‍య్యారు. ఈ వీడియోపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. ఇక ఈ వీడియో పై విచారణ చెప్పట్టాలని ఒక‌వైపు బీజేపీ మ‌రోవైపు హార్దిక్ ప‌టేల్ కూడా కోరడం విశేషం. ఇక వ్య‌వ‌హారంతో గుజరాత్ రాజకీయాల్లో ఏ మలుపు తీసుకుంటుందో అని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.