Home / MOVIES / నా మొద‌టి కిస్‌ను డ‌బ్బుకోసం అమ్మేశా!.. లావ‌ణ్య త్రిపాఠి

నా మొద‌టి కిస్‌ను డ‌బ్బుకోసం అమ్మేశా!.. లావ‌ణ్య త్రిపాఠి

ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ర్టీలో వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న న‌టీమ‌ణుల్లో లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అయోధ్యలో జ‌న్మించిన ఈ అమ్మ‌డు అందాల ర‌క్ష‌సి సినిమాతో తెలుగు ఇండ‌స్ర్టీలో అడుగు పెట్టింది. అందాల రాక్ష‌సి ఇచ్చిన హిట్ కిక్‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను చేజిక్కిచుకుంటూ వ‌స్తోంది ఈ భామ‌. అంతేకాదు. ఈమె ఉంటే చాలు సినిమా స‌గం హిట్టే అన్న వ‌దంతు కూడా ఉంది సినిమా ఇండ‌స్ర్టీలో.

అయితే, లావ‌ణ్య త్రిపాఠి తెలుగులో అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, లచ్చిందేవికీ ఓలెక్కుంది, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, మిస్ట‌ర్‌, తాజాగా రామ్ హీరోగా న‌టించిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రంలోనూ న‌టించింది లావ‌ణ్య త్రిపాటి.

తాజాగా, లావ‌ణ్య త్రిపాఠి ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను కెరియ‌ర్ ప్రారంభించిన రోజుల్లో జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. 2006లో మోడ‌ల్‌గా మిస్ ఉత్త‌రాఖండ్ టైటిల్ గెలుచుకున్నాన‌ని తెలిపింది. మోడ‌ల్‌గా త‌న‌కు వ‌చ్చిన మొద‌టి పారితోషకం రూ.5వేల‌ని, ఆ మొత్తాన్ని నాన్న‌కే ఇచ్చేశాన‌ని చెప్పింది ఈ భామ‌.

అనంత‌రం మీ జీవితంలో మొద‌టి కిస్ ఎవ‌రికిచ్చారు అంటూ ఎదురైన ప్ర‌శ్న‌కు స్పందించిన లావ‌ణ్య త్రిపాటి.. నా మొద‌టి కిస్ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో హీరో నానికి ఇచ్చేశాన‌ని చెప్పింది. ఆ సినిమాలో టైటిల్ సాంగ్‌లో సంద‌ర్భానుసారంగా త‌న మొద‌టి కిస్ సీన్‌ను ద‌ర్శ‌కుడు షూట్ చేశార‌ని సిగ్గుప‌డుతూనే చెప్పింది. అలాగే త‌నకు కాబోయే వాడు గురించి మాట్లాడుతూ.. త‌న‌కు హానెస్ట్ నెస్ ఉంటే చాల‌ని, త‌న నుంచి ఇంకేమీ ఆశించ‌న‌ని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat