నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..!

నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..!

జ‌గ‌న్ పాద‌యాత్రకి క‌నీ విని ఎరుగని రీతిలో జ‌నం వ‌స్తుండంతో టీడీపీ నేత‌లకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు నుండే జగ‌న్‌ని టార్గెట్ చేస్తూ జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్నారు. ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల పిచ్చి రాత‌లు ఎంత‌లా దిగ‌జారాయంటే.. జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లంతా సెకిల్ ఎక్కుతున్నార‌ని కొంత మంది పేర్ల‌తో స‌హా ప్ర‌క‌టించి ఎల్లో పత్రిక‌.

ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీ నుండి 22 ఎమ్మెల్యేలు గోడ దూక‌గా.. ఇంకా చాలామంది దూకేందుకు సిద్ధంగా ఉన్నారని వారిలో కురాపాం నియోజ‌క వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే పుష్ప‌శ్రీవాణి కూడా ఉన్నార‌ని ఆ ప‌త్రిక ప్ర‌చురించింది. దీంతో వెంట‌నే ఉప్పు అందుకున్న టీడీపీ తోక పత్రిక‌లు.. సోష‌ల్ మీడియాలో ఆ వార్త‌ని హైలెట్ చేశాయి.

దీంతో వెంట‌నే స్పందించిన ఎమ్మెల్యే పుష్ప‌శ్రీవాణి.. నా కులదేవత సాక్షిగా చెబుతున్నా.. నాలో ఊపిరి ఉన్నంత‌వ‌ర‌కు నేను మా జగన్ అన్నను విడిచి వెళ్ళనని చెప్పింది.. ఎన్నిక‌ష్టాలు ఎదురొచ్చినా జగన్ తోనే రాజకీయంగా కొనసాగుతానని స్ప‌ష్టం చేసింది. టీడీపీ విసిరే ఎంగిలి మెతుకుల కోసం తాను ఆశపడనని.. ఆలా ఆశపడి పోయినవాళ్లు సుధీర్ఘ‌ రాజకీయాల్లో రాణించలేరని ఆమె ఫైర్ ఆయ్యారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుండి ఫిరాయించిన నేత‌లంతా డ‌బ్బుకోసం క‌క్కుర్తి ప‌డి వెళ్ళిన‌వాళ్ళేన‌ని.. ప్ర‌జ‌ల కోస‌మో.. అభివృద్ది కోస‌మో కాద‌ని ఆమె ద్వ‌జ‌మెత్తారు.