స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు .. – Dharuvu
Breaking News
Home / POLITICS / స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..

స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..

తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మరో ఘనతను సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్న స్వచ్చ జిల్లా జాబితాలో చోటు సంపాదించుకుంది .ఈ విషయాన్నీ రేపు బుధవారం 15వ తారీఖున ప్రకటించనున్నారు .స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో వివధ దశల్లో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్కటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు .

మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘనతను సాధించిన జిల్లాల వరసలో పెద్దపల్లి జిల్లాది ఆరో స్థానం ..మొత్తం జిల్లాలో ఒక లక్ష ముప్పై ఏడు వేల అరవై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి .గతంలోనే తొలిదశలో ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు .జిల్లాలో మిగిలిన ఐదు మండలాలు అయిన ధర్మారం ,కమాన్ పూర్ ,మంథని ,ముత్తారం ,రామగుండంలో వందశాతం పూర్తిచేసుకొని స్వచ్చత జిల్లాగా మారేందుకు సంబంధిత అధికారులు తీవ్రంగా కష్ట పడ్డారు .