సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం .. – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..

సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..

బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ రాష్ట్రం జాతి,మత విద్వేషాలకతీతమైన ఒక ప్రేమైక సమాజంగా వెలుగొందాలనే కలలుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాషగా ప్రకటించడం అందరు హర్షించదగిన గొప్ప ముందడుగు అని తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు .

తెరాస ఆస్ట్రేలియా మైనారిటీ శాఖా అధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ అధ్యక్షతన మెల్బోర్న్ లో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉర్దూ భాషకు తెలంగాణ కు ఉన్న అనుబంధాన్ని వివరించారు . ఉర్దూ ను అధికార భాషగా గుర్తించడమే గాకుండా ,ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ టీచర్ లను నియమించడం ,నీట్ ని కూడా ఉర్దూ లో రాయించేందుకు కేంద్రాన్ని ఒప్పించడం లో కెసిఆర్ గారి పాలనాదక్షతను చాటుతుందని ఉద్ఘాటించారు .

తెలంగాణ పునర్నిర్మాణం లో పాలుపంచుకుంటామని తీర్మానం చేసారు . ఈ సమావేశం లో మైనారిటీ సెల్ నాయకులూ ముజీబ్, సయ్యద్, జమాల్ తో పాటు తెరాస నాయకులు డా అనిల్ రావు చీటీ , సత్యం రావు , అమర్ రావు, విశ్వామిత్ర , యశ్వంత్ , డా అర్జున్ చల్లగుళ్ళ , ప్రకాష్ సూరపనేని , అభినయ్ కనపర్తి పాల్గొన్నారు .