తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్.. – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..

తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు .

గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు .కొత్త రాష్ట్రమైన కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా చర్చవంతంగా జరుగుతున్నాయి .ప్రతిపక్షాలు మాట్లాడటానికి తగిన సమయం కేటాయిస్తున్నారు .

సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే మరోవైపు ప్రతిపక్షాలు అంటే సభ మర్యాదలను పాటిస్తున్నారు అని ఆయన అన్నారు .తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపక్షాలకు గంటల తరబడి సమయం ఇస్తుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవ్వాల్సిన సమయం కూడా ఇవ్వడంలేదు అని ఇదే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరుకు ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుకు తేడా అని ఆయన అన్నారు .