Home / NATIONAL / ఆ సినిమాలను చూసేవాడ్ని -గోవా ముఖ్యమంత్రి ..

ఆ సినిమాలను చూసేవాడ్ని -గోవా ముఖ్యమంత్రి ..

గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తను యంగ్ గా ఉన్నసమయంలో చేసినపనుల గురించి సరదాగా విద్యార్థులతో పంచుకున్నారు. పనాజీలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు .బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పారికర్‌ విద్యార్థులతో ముచ్చటించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సినిమాలను చూసేవారు? అని ఒక విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు పారికర్‌. ‘మేం మాములు సినిమాలనే కాదు.. ఆ వయస్సులో ‘పెద్దల’ సినిమాలను కూడా చూసేవాళ్లం.

మేం అప్పుడు ఆ సినిమాల్లో చూసినవాటికంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని టీవీల్లో ఎక్కువ చూస్తున్నారు.’ అని వెల్లడించారు.
‘అప్పుడు నేను, నా సోదరునితో కలిసి ఓ పెద్దల సినిమాకు వెళ్లాను. విశ్రాంతి సమయంలో లైట్స్‌ వేయగానే మా పక్కింటి వ్యక్తి ఒకరు మా పక్కనే కూర్చున్నట్లు గమనించాను. అతను ప్రతిరోజు మా అమ్మతో మాట్లాడతాడు. దీంతో నా గుండె ఆగినంత పని అయింది. వెంటనే నేను, మా సోదరుడు ఆ సినిమా హాల్‌ నుంచి బయటకి వచ్చాం. అప్పటికే అతను మమ్మల్ని చూసేశాడు.

అయితే అమ్మ వద్ద తిట్లు తినకుండా తప్పించుకునేందుకు ఒక ఉపాయం ఆలోచించాం. వెంటనే అమ్మ వద్దకు వెళ్లి ఓ సినిమాకు వెళ్లినట్లు చెప్పాం. అయితే ఆ సినిమా అభ్యంతరకమైన సినిమా అని మొదట తెలియదని.. దీంతో సినిమా మధ్యలోనే బయటకు వచ్చినట్లు చెప్పాం. దీంతోపాటు ఆ సినిమా చూడటానికి మన పక్కింటి వ్యక్తి కూడా వచ్చినట్లు జోడించాం.’‘ఆ మరుసటి రోజు.. మేం అనుకున్నట్లే.. పక్కింటి వ్యక్తి వచ్చి మాపై మా అమ్మకు ఫిర్యాదు చేశాడు. మా అమ్మ వెంటనే అతన్ని కడిగేసింది. మా పిల్లలు సినిమాకు వెళ్లినట్లు నాకు తెలుసు. కానీ నీవెందుకు అలాంటి సినిమాకు వెళ్లావు? అని ప్రశ్నించింది. దీంతో అతను వెంటనే బిక్కమొహం వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అంటూ ఆరోజుల్లో జరిగిన సరదా ఘటన గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat