నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన .. – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన ..

నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన ..

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ,టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ఇష్యూ నంది అవార్డుల ప్రకటన .గత మూడు ఏండ్లుగా ఈ ఏడాది మినహా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల సినిమాలను ఆధారంగా తీసుకోని అత్యుత్తమ నటుడు ,నటి ,దర్శకుడు ,నిర్మాత ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కు సంబంధించి నంది అవార్డులను ప్రకటించింది టీడీపీ సర్కారు .

ఈ అవార్డుల ప్రకటనలో అత్యధికంగా నందమూరి హీరో ,హిందుపూరం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే ,ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్వయానా వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణకు ఏకంగా ఎనిమిది నంది అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం .

ఈ విషయం గురించి ఇటు రాజకీయ వర్గాల నుండి అటు ప్రజల నుండి ,నెటిజన్ల నుండి తీవ్ర విమర్శల పర్వం కురుస్తుంది .తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడు సతీమణి నారా బ్రాహ్మణిను నంది అవార్డులపై మీ స్పందన ఏమిటి అని విలేఖర్లు ప్రశ్నించారు .దీనికి సమాధానంగా బ్రాహ్మణి స్పందిస్తూ నంది అవార్డుల పై మాట్లాడే సమయం కానీ వేదిక కాదు అని ఆమె తెలిపారు .అయితే తన తండ్రికి నంది అవార్డులు రావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేయడం విశేషం .