వారి కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం.. – Dharuvu
Breaking News
Home / TELANGANA / వారి కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం..

వారి కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం..

నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు ప్రమాద ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలను పరిహారంగా అందించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సొరంగం పనుల కోసం కూలీలతో వెళ్తుండగా ఉదయం టిప్పర్ బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. గాయపడిన వారిని మంత్రి జూపల్లి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అదేవిధంగా మరో 10 లక్షల బీమా సొమ్ము చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.