వ‌రంగ‌ల్‌కు మ‌రిన్ని కంపెనీలు..మంత్రి కేటీఆర్‌ – Dharuvu
Breaking News
Home / SLIDER / వ‌రంగ‌ల్‌కు మ‌రిన్ని కంపెనీలు..మంత్రి కేటీఆర్‌

వ‌రంగ‌ల్‌కు మ‌రిన్ని కంపెనీలు..మంత్రి కేటీఆర్‌

కాక‌తీయుల ఏలుబ‌డిలో రాజ‌ధానిగా ఉన్న వ‌రంగ‌ల్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అంతే ప్రాధాన్యంగా తీసుకొని గుర్తిస్తున్న‌దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ముందుకు సాగుతున్నార‌ని వివరించారు.  హ‌న్మ‌కొండ‌ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంత‌రం మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు.
అన్ని రంగాల్లో వరంగల్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌కు మరోసారి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.  హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వరంగల్‌ను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ మధ్య మరిన్ని సంస్థలు రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పన కోసం టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ సంక్షేమం  కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింద‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు.  పేదల పెన్షన్ల కోసం రూ. 4600 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు… ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం అన్నం పెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలాగా మారారని మంత్రి చమత్కరించారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ. 75,116 ఇస్తున్నామ‌న్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థి మీద లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. గర్భిణీలకు కేసీఆర్ కిట్‌తో పాటు రూ. 12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారని.. కానీ తెలంగాణ నిరంతర కరెంటుతో వెలిగిపోతున్నదని మంత్రి తెలిపారు.