కామమా లేక పిచ్చా తెలియదుగాని 36ఏళ్ల మహిళ బరితెగించింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కొడుకు స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో సదరు మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ గత 2015వ సంవత్సరం తన కుమారుడి స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పరుచుకుంది.
అప్పుడప్పుడు ఇంటికొచ్చే ఆ బాలుడికి ఆల్కహాల్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక అతనితో లైంగికంగా కలిసేది. ఆ ఫోటోలను కూడా ఆ బాలుడికి పంపింది. ఈ క్రమంలో గర్భం ధరించిన ఆ మహిళ ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఇక డీఎన్ఏ పరీక్షల్లో 15ఏళ్ల బాలుడే ఆ బిడ్డకు తండ్రి అని తేలింది. యువ ప్రాయంలోనే బాలుడిని లొంగదీసుకుని లైంగికంగా వేధింపులకు గురిచేసిన నేరానికి గాను.. 36ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆమెకు నాలుగేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది