Home / TELANGANA / కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..

కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి  వ్య‌తిరేకంగా ముందుకు సాగ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని రాష్ట్ర శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలు లేని,ఆకుపచ్చ తెలంగాణ నిర్మించేందుకు తాము ముందుకు సాగుతుంటే..ప్రాజెక్టులను అడ్డుకునే ఎజెండాతో తప్పుడు కేసులు వేస్తుండ‌ట‌మే కాంగ్రెస్ ప‌నిగా పెట్టుకుంద‌న్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక శక్తులను తరిమికొట్టాలని మంత్రి హ‌రీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట రూరల్ మండలంతొర్నాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజి ని ప్రారంభించిన సభలో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరుగుతూ వారి రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టారు.సిద్దిపేట రూరల్ మండలం తొర్నాల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంకు చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని,బాలుర,బాలికల వసతి గృహ భవనాలను  రాష్ట్ర వ్యవసాయ,ఇరిగేషన్ మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి,  హరీశ్ రావు సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేత‌లను పొలాల్లో చీడ పురుగులు, కలుపు మొక్కలను ఏరి పారేసినట్టు ఏరిపారేయాలని రైతులను కోరారు. 2019 లో అధికారంలోకి వస్తామని కాంగ్రేస్ పార్టీ పగటి కలలు కంటున్నదని పేర్కొంటూ అభివృద్ధి కోసం వారు చేసింది ఏంట‌ని ప్ర‌శ్నించారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితేనే  రైతు ల ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సాగునీటి సమస్య, ఆడపిల్ల పెండ్లి, వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం వంటి అవసరాలతో రైతులు ఆప్పుల్లో కూరుకుపోతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరమన్నారు. వారిని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆడపిల్లల పెళ్ళికి కళ్యాణలక్ష్మి కింద 75,116 రూపాయలు ఇస్తున్నామని, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. అలాగే నిరుపేద ప్రజలు తమ ఆరోగ్యం కోసం ప్రయివేటు ఆస్పత్రుల్లో మొత్తం సంపాదన ధారపోస్తూ, ఇంకా దారుణంగా అప్పుల పాలవుతున్నారని మంత్రి తెలిపారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.సిద్ధిపేట, మెదక్,సంగారెడ్డిలలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లను నెలకొల్పుతున్నట్టు మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న వారిని తిప్పికొట్టాలని హ‌రీశ్ రావు కోరారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణకు అడ్డు తగులుతూ చనిపోయిన వారు,ఉపాధి కోసం వేరే దేశాలలో ఉన్న వాళ్ళ పేర్లతో వేలిముద్రలు, దొంగ సంతకాలతో కేసులు వేసిన వివరాలతో మంత్రి చెండాడారు. కోర్టులను కూడా కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నట్టు విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారుడు,దివాళా కోరు రాజకీయాలు నడుపుతున్న దని అన్నారు. మల్లన్నసాగర్ పై కేసులు వేసిన మహేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్ పై ఓడిపోయారని అన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం లో అటవీ, పర్యావరణ సంబంధమైన కేసులు వేసిన హర్ష వర్ధన్ జూపల్లి కృష్ణారావు పై ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు భారత ఆహార, వ్యవసాయ మండలి నుంచి అరుదైన గౌరవం లభించిందని హరీశ్ రావు చెప్పారు. రైతన్నల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు వరించిందనే విషయాన్ని గుర్తు చేశారు. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసినట్టు చెప్పారు. లక్షలాది మంది రైతుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు గొప్ప అవార్డు వచ్చిందన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కృషి చేసే వారికి 2008 నుంచి భారత ఆహార వ్యవసాయ మండలి ఈ అవార్డును ప్రదానం చేస్తోందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన విధానాలు, పథకాల అమలుకు గుర్తింపుగా ఈ అవార్డు కేసీఆర్ కు ప్రకటించినట్లు భారత ఆహార, వ్యవసాయ మండలి స్పష్టం చేసిందని హరీశ్ రావు వివరించారు.తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేయడమే  సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పైన కాళేశ్వరం, కింద పాలమూరు ప్రాజెక్టులను,అలాగే సీతా రామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అనుకున్న గడువు కంటే ముందే ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని హరీష్ చెప్పారు. అంతే కాకుండా రైతులకు ఆసరాగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ 2018 నుంచి ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు.రైతులకు  17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat