Home / NATIONAL / జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..

జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..

సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో చేసిన పాపాల మూలంగానే మనుషులకు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి ..

కాన్సర్‌వంటి రోగాల వెనుక, యాక్సిడెంట్‌లలో మనుషులు చనిపోవటానికి కూడా కర్మే కారణమంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు .దీనిపై హేతువాదులు, పాత్రికేయులు, ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు బిస్వాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అయితే ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ పల్లవి ఘోష్‌ అనే జర్నలిస్ట్‌ ఆయన్ని డిమాండ్‌ చేయగా.. బిస్వా వేదాంత ధోరణిలో వివరణ ఇచ్చుకున్నారు. పాపాని-కర్మకు మధ్య చాలాతేడా ఉంది. అది గుర్తించండి. రాజకీయాలు వస్తూ పోతూ ఉంటాయ్‌. కానీ, భవద్గీతలో ఏదైతే చెప్పబడిందో అదే శాశ్వతం. నేను దాన్నే పాటిస్తాను’’ అని బిస్వా సమాధానమిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat