Home / SLIDER / మెట్రో ప్రయాణం..ప్రతీ ప్రయాణికుడు పాటించాల్సినవి.. చేయకూడనివి ఇవే

మెట్రో ప్రయాణం..ప్రతీ ప్రయాణికుడు పాటించాల్సినవి.. చేయకూడనివి ఇవే

ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో ప్రయాణీకులు స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శివానంద్ నింబార్గి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ప్రయాణికుడు ప్రయాణంలో పాటించవలిసిన అంశాలపై సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు.

ప్రయాణికులు పాటించాల్సినవి..
1. మెట్రోరైలు పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి వ్యర్థపదార్థాలను డస్ట్ బిన్స్‌లో వేయాలి.
2. మెట్రో లోపల ఉన్నప్పుడు జాగ్రత్తగా అనౌన్స్‌మెంట్లు వినాలి.
3. సహాయం కోరేవారు కస్టమర్ సర్వీస్ టీం లేదా స్టేషన్‌స్టాఫ్‌ను సంప్రదించాలి.
4. మెట్రోప్రాజెక్టుకు, ప్రయాణికులకు నష్టం చేసే చర్యలు కంటపడితే వెంటనే స్టాఫ్‌కు సమాచారం అందించాలి.
5. సెక్యూరిటీ చెకింగ్ విషయంలో స్టేషన్ స్టాఫ్‌కు సహకరించాలి.
6. తోటి ప్రయాణికులు, సిబ్బందితో మర్యాదపూర్వకంగా ఉండాలి.
7. మెట్లు, ఎస్కలేటర్లు ఎక్కేటప్పుడు ముందుకు మాత్రమే చూడాలి.
8. గమ్యానికి చేరిన వెంటనే స్టేషన్లలో వేచిచూడకుండా వెళ్లిపోవాలి.
9. రైలులో ప్రయాణించేటప్పుడు, ఎస్కలేటర్ మీద ఉన్నప్పుడు ఎడమవైపున మూవింగ్ డైరెక్షన్‌లో నిల్చోవాలి.
10. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులకు చేయూత నివ్వాలి.
11. బేబీ బగ్గీస్, వీల్‌చైర్ల్ల కోసం ఎలివేటర్స్‌ను వినియోగించాలి.
12. ఎస్కలేటర్ నుంచి దిగిన తక్షణమే అక్కడినుంచి వెళ్లిపోవాలి
13. టికెట్ కౌంటర్లు, వెండింగ్ మెషిన్స్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల వద్ద క్యూ పద్దతి పాటించాలి. మెట్రో ప్రయాణంతోపాటు టికెట్లు తీసుకునేటప్పుడు గొడవకు తావివ్వరాదు.
14. టికెట్ లేకుండా ప్రయాణించడం శిక్షార్హం. మెట్రోరైలు సిబ్బంది అడిగిన వెంటనే టోకెన్స్, స్మార్ట్‌కార్డ్స్ చూపించాలి.
15. అత్యవసర పరిస్థితుల్లో మెట్రో పరిసరాలను వెంటనే ఖాళీ చేయాలి.
16. ప్రయాణించేటప్పుడు ఇతర ప్రయాణికులను అనుమతించాలి.
17. ప్లాట్‌ఫాం, మెట్రోరైలుకు మధ్య ఉన్న గ్యాప్‌ను రైలు ఎక్కుతున్న, దిగుతున్న సందర్భాల్లో దృష్టిలో ఉంచుకోవాలి.

చేయకూడనివి..
1. మెట్రో పరిసరాల్లో ఉమ్మడం, చెత్త వేయడం చేయవద్దు. పొగాకు నమలడం, పాన్ తినడం నిషేధం.
2. మద్యం సేవించడం, పొగత్రాగడం చేయరాదు.
3. మెట్రోలోపలి భాగంలో ఫొటోగ్రఫీ నిషేధం
4. సరుకులు మెట్రోరైలులోపల విడిచిపెట్టి వెళ్లవద్దు.
5. మెట్రోరైలు లోపలి భాగంలో రైళ్లో ఫ్లోర్‌పై కింద కూర్చోవద్దు.
6. ప్రయాణంలో ఎటువంటి ఆహార పదార్థాలు, బేవరేజెస్ వాడకూడదు.
7. పెంపుడు జంతువులను మెట్రోరైలు పరిసరాల్లోకి అనుమతించబడవు.
8. మండే ఇంధనాలు నిషేధం
9. ఎస్కలేటర్స్ మీద కూర్చోవడం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించవద్దు
10. మెట్రోరైలు కోసం వేచిచూస్తున్నప్పుడు ప్రయాణికులెవరూ పసువురంగు గీతను దాటవద్దు.
11. రైలు ప్రయాణిస్తున్నప్పడు బలవంతంగా డోర్లు తెరవడానికి ప్రయత్నించవద్దు. వాటికి ఆనుకొని నిలబడవద్దు.
12. ప్రయాణంలో ఒకరినొకరు నెట్టుకోవడం లాంటివి చేయవద్దు.
13. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
14. ఓవర్‌హెడ్ తీగలకు సమీపంగా నిల్చోరాదు.
15. ఆయుధాలను మెట్రో పరిసరాల్లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతిలేకుండా తీసుకురావద్దు.
16. అంధుల కోసం వేసిన ట్యాక్టిల్ పాత్ మీద నడువొద్దు.
17. మెట్రోరైలు డ్రైవర్లను అనవసరంగా డిస్ట్రబ్ చేయవద్దు. మెడికల్ ఎమర్జెన్సీ, ఆస్తికి , ప్రాణాలకు ప్రమాదం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వీరిని కాంటాక్ట్ చేయాలి.
18. మెట్రోరైలు పరిసరాల్లోకి హాకర్స్ నిషేధం.
19. మెట్రో స్టేషన్లలో అగే సమయంలో లేదా ప్రయాణించేటప్పుడు మెట్రోరైలు డోర్లు మూసుకునేటప్పుడు నిలబడవద్దు.
20. అనుమతిలేకుండా ఎటువంటి ప్రకటనలు చేయరాదు.
21. మెట్రోరైలు పరిసరాలను చెడగొట్టేవారు శిక్షార్హులు
22. మెట్రోట్రైన్ సేఫ్టీ పరికరాలను టాంపర్ చేయరాదు.
23. ఇతర ప్రయాణికులకు మీ స్మార్ట్‌కార్డు, టోకెన్‌ను షేర్ చేయవద్దు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat