Home / ANDHRAPRADESH / ఇట్స్ అఫిషియ‌ల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలిస్తే షాకే..!

ఇట్స్ అఫిషియ‌ల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలిస్తే షాకే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో రెస్పాన్స్ వ‌స్తోంది. మొద‌ట పాద‌యాత్రను ప్రారంబించే వ‌ర‌కు కొంచె అనుమానాలు ఉన్నా.. పాద‌యాత్ర ప్రారంభించాక జ‌నం వేలల్లో త‌ర‌లి రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జ‌గ‌న్ కూడా ఒక‌వైపు పాద‌యాత్రలో బాగంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూనే… మ‌రోవైపు ఆయా నియోజ‌క వ‌ర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్య‌క‌ర్త‌ల‌తో పూర్తిగా మ‌మేక‌మై అక్క‌డి పరిస్థితుల‌ను అడిగి తెలుసుకొని ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. దీంతో కార్య‌క‌ర్త‌లు అంద‌రు కూడా జ‌గ‌న్ వైఖ‌రితో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న స‌భల్లో అయితే జ‌గ‌న్ త‌న స్పీచ్‌ల‌తో ఇర‌గ‌దీస్తున్నార‌నే చెప్పాలి. జ‌గ‌న్ ప్ర‌సంగాల్లో గ‌తంలోలాగా టీడీపీ నేత‌ల పై ప్ర‌త్య‌క్షంగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా.. పూర్తి ఆధారాల‌తో చంద్ర‌బాబ స‌ర్కార్ బండారాన్ని ఎండ‌గ‌డుతున్నారు. ఇప్పుడు తాజాగా అయితే జ‌గ‌న్ ఒక సంచ‌ల‌న జోస్య‌మే చెప్పారు. గొర్లగుంటలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 137 స్ధానాల్లో గెలుస్తుందని ఢండా భజాయించి మరీ ప్రకటించారు. బహుశా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఏమైనా సర్వేలు నిర్వహించి నివేదిక ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే, ప్రశాంత్ కొంతకాలంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వేలు కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే స‌ర్వేల మాట ఎలా ఉన్నా ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి అనేది వాస్తవం. ఎందుకంటే.. చంద్ర‌బాబు స‌ర్కార్ పై పూర్తిగా వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నే విష‌యం.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌నాన్ని చూస్తేనే అర్ధం అవుతోంది. ఏది ఏమైనా ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ క‌చ్ఛితంగా ఇన్ని సీట్లు గెలుస్తుంద‌ని ఎవ‌రూ చెప్ప‌డానికి సాహ‌సించ‌రు.. ఎందుకంటే అలా చెప్పిన దానికి కొద్ది తేడాలో రిజ‌ల్ట్స్ వ‌స్తే ఓకే.. భారీ తేడా వ‌స్తే ప‌రిణామాలు వేరేగా ఉంటాయ్‌.. అయినా జ‌గ‌న్ జ‌డ‌వ‌కుండా అంత కాన్ఫిడెంట్‌గా త‌న పార్టీ గెలిచే స్థానాల‌ను ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయి వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat