Home / LIFE STYLE / హార్మోన్స్ గురించి మీకు తెలియ‌ని ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం!

హార్మోన్స్ గురించి మీకు తెలియ‌ని ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం!

నేటి స‌మాజంలో సాధార‌ణంగా మ‌న దేశ ఆచారాల‌ప‌ట్ల‌, సంప్ర‌దాయాల‌ప‌ట్ల, పెద్ద‌లు చెప్పే మాట‌ల ప‌ట్ల ఒక నిర్ల‌క్ష్య వైఖ‌రి ఉంది. అయితే మ‌న పురాణాలు, శాస్ర్తాలు ఎంత గొప్ప‌వో, వాటిలోని వైజ్ఞానిక‌త నేటి మ‌న ఆధునిక విజ్ఞాన శాస్ర్తం ద్వారా రుజువ‌వుతున్నాయి. అలాగే నేటి విజ్ఞాన శాస్ర్తం క‌నుగొన్న హార్మోన్స్ గురించి చ‌దివితే అవి దైవానికి ప్రతీక‌లా అనిపిస్తోంది.

హార్మోన్ అనేది దివ్య ర‌సాయ‌నం అనిపిస్తుంది. మ‌న మ‌నోభావాల‌ను అనుస‌రించి దేహంలో హార్మోన్స్ పుడుతుంటాయి. అవి భావాల‌ను ప్రేర‌ణ వ‌ల్ల పుడుతూనే .. భావాల‌ను ప్రేరేపిస్తుంటాయి. దుఃఖ‌ప‌డ‌టం, చింత‌ప‌డ‌టం ప్రారంభిస్తే.. త‌ర‌చూ ఆ ప‌నినే పున‌రావృతం చేస్తే వెలువ‌డే హార్మోన్స్ క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి రోజూ అదే టైముకి వెలువ‌డ‌టం ఆరంభిస్తాయ‌ట‌. అలా వెలువ‌డే హార్మోన్లు మ‌ళ్లీ భ‌విష్య‌త్తులో అదే స‌మ‌యానికి దుఃఖ‌ప‌డే అవ‌స‌రం గురించో (అది ఇప్పుడు లేద‌ని) రాబోయేది దుఃఖమ‌నో దుఃఖ‌ప‌డేలా చేస్తాయ‌ట‌.

ఆనంద ర‌సాయ‌నాన్ని విడుద‌ల చేసే ప‌నులు (ఫ్రీ స‌ర్వీస్‌, దానం, ధ్యానం, సామూహిక భ‌జ‌నాలు) చేస్తూంటే ఆనంద ర‌సాయ‌నం ఎక్కువ విడుద‌ల అవుతూ ఆనంద కార‌ణాలు లేకున్నా నిరంత‌రం ఆనందంగా ఉండేలా చేస్తాయ‌ట‌. న‌వ్వుతూ కాలం గ‌డిపేవారు దుఃఖించే అవ‌స‌ర‌మే రాద‌ట‌. మ‌నం చేయ‌బూనిన ప‌నికి దైవం స‌హ‌క‌రిస్తుంది అన్న పెద్ద‌ల మాట ఇక్క‌డ ప‌రిశీలించాలి. దుఃఖించ‌డం అల‌వాటు చేస్తే దుఃఖాన్ని ఆనంద‌ప‌డ‌టం అల‌వాటు చేస్తే ఆనందాన్ని ఈ ర‌సాయ‌నాలు (హార్మోన్లు), మ‌న ప్ర‌య‌త్నాల్ని ప్రోత్స‌హించే దైవంకంటే వేరు కాద‌నిపిస్తోంది.

గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు త‌ల్లి ఆనంద‌దంగా ఉంటే పుట్టిన శిశువు జీవితం గ‌డిపితే సంవ‌త్స‌ర‌మంతా ఆనందంగా ఉంటుందని, ఆనందంగా నిద్ర లేస్తే రోజంతా ఆనందించ‌వ‌చ్చ‌ని ఏడుస్తూ లేస్తే రోజంతా ఏడుపేన‌ని చెప్పే మ‌న ఆచారాలు ఎంత వైజ్ఞానికాలో అర్థ‌మ‌వుతుంది. సుఖ సంతోషాల‌తో గ‌డ‌ప‌కుండా త‌రచు గ‌తాన్ని గురించో, భ‌విష్య‌త్తు గురించి ఆలోచించి చింఇంచేవారు దుర‌దృష్ట‌వంతుల‌ని, నిత్యానందంతో ఉండ‌టం మ‌న చేతిలో ప‌నేన‌ని అర్థ‌మ‌వుతుంది. సుఖ‌స్య దుఃఖ‌స్య‌స్వేవ దాతా అన్న నిత్య స‌త్యం ఒక‌టుంది. మ‌న సుక దుఃఖాల‌కు మ‌న‌మే కార‌ణ‌మ‌న్న మ‌న పెద్ద‌ల మాటా ఉంది. అవి ఎంత‌టి అర్థ‌వంతాలో ఆధునిక ప‌రిశోధ‌న‌లూ రుజువు చేస్తున్నాయి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat