రేపు హైదరాబాద్ కు ఇవాంక.. షెడ్యూల్ ఇదే – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / రేపు హైదరాబాద్ కు ఇవాంక.. షెడ్యూల్ ఇదే

రేపు హైదరాబాద్ కు ఇవాంక.. షెడ్యూల్ ఇదే

మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టనున్నారు. రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తను బస చేసే హోటల్ వెస్ట్ ఇన్ కు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌తో కలిసి ఇవాంక గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు హోటల్ ట్రైడెంట్‌కు వెళ్తారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు తిరిగి వెస్టిన్ హోటల్‌ కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు ఫలక్ నుమా నుంచి బయల్దేరి 10.40కి హోటల్ వెస్టిన్‌కు వెళ్తారు.

బుధవారం (29న) ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఇవాంక హోటల్ వెస్టిన్ నుంచి బయల్దేరి పది గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. సదస్సులో పలు కార్యక్రమాలకు హాజరైన అనంతరం ఉదయం 11 గంటలకు హెచ్ఐసీసీ నుంచి హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఇవాంక ట్రంప్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.హైదరాబాద్ టూర్‌లో ఇవాంకకు 18 గంటల పాటు ఖాళీ సమయం దొరకనుంది. ఆ టైంలో ఆమె నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.