హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా.. – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా..

హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా..

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు.