Home / SLIDER / మెట్రో + ఇవాంకా హైదరాబాద్‌లో రారండోయ్‌…వేడుక చూద్దాం..

మెట్రో + ఇవాంకా హైదరాబాద్‌లో రారండోయ్‌…వేడుక చూద్దాం..

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌ నగర చరిత్రలో మంగళవారం మరో చారిత్రాత్మక దినోత్సవం కానుంది. నగరానికే మణిహారం లాంటి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒకవైపు…ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌) హైదరాబాద్‌లో మొదలవనుంది. మొత్తం దక్షిణాసియాలోనే ఇంతటి మహా సదస్సు తొలత హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. ఈ రెండు వేడుకల కోసం ఇప్పటికే హైదరాబాద్‌ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ట్రంప్‌ కుమార్తే ఆయన విధానపరమైన నిర్ణయాల సలహాదారు ఇవాంక ట్రంప్‌ ఈ వేడకులకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదీల చిరకాల కోరికగా ఊరిస్తూ వస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు ఈ రెండు మహా ఘట్టాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి.
ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు విశ్వ వ్యాప్తంగా దాదాపు 140 దేశాల నుంచి 1500 మంది అతిథులు ఒక్కరొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్త మీడియా హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, వారికి సరైన చేయూతను అందించేందుకు గాను అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వం సౌజన్యంతో 8వ విడుత ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రతిభగల వారికి తగిన తోడ్పాటుతో పాటు వారికి అవసరమైన ఆర్థిక దన్నును కూడా అందించాలనే లక్ష్యంతో ఇందులో రంగాల వారీగా సమావేశాలను ఏర్పాట చేస్తున్నారు. మంగళవారం (28న) ప్రారంభమయ్యే ఈ సదస్సు ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది నిర్వహించే ఈ జీఈఎస్‌ సదస్సులో ‘విమెన్‌ ఫస్ట్‌, ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ఊతం అందించి వారు ప్రపంచ వృద్ధిలో పాలు పంచుకొనేలా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సదస్సులో అమెరికా బృందానికి నాయకత్వం వహిస్తున్న ఇవాంక ట్రంప్‌ ప్రపంచ మార్కెట్లలో ఆధునిక పరిణామాలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఎదురవుతున్న అవరోధాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు.
ప్రసంగించనున్న ప్రముఖులు..
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయనున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సదస్సుల్లో ఇటీవలే ప్రపంచ సుందరిగా ఎంపికైన మనుషీ చిల్లార్‌, మిస్సైల్‌ విమెన్‌ టెస్సీ థామస్‌, బాలీవుడ్‌ స్టార్‌ సోనమ్‌ కపూర్‌, టాలివుడ్‌ నటుడు రామ్‌ చరణ్‌, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌తో పాటు సినీ నటులు అదితీ రావు హైద్రీలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అయితే ప్రారంభ వేడుకల్లో మాత్రం కేవలం ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌తో పాటు అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకాలు మాత్రమే ప్రసంగించనున్నారు. ఆ తరువాత రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొననున్న పారిశ్రామికవేత్తల్లో టీవీఎస్‌ క్యాపిటన్‌ ఫండ్స్‌ సీఎండీ గోపాల్‌ శ్రీనివాసన్‌, కార్లెలీ ఇండియా సలహాదారులు ఎండీ నీరజ్‌ భరద్వాజ్‌. స్టార్‌ అధినేత వికాస్‌ ఖన్నా, యామ్‌వే కార్పొరేషన్‌ అధ్యక్షుడు డోగ్‌ డెవోస్‌, ఫిప్‌కార్ట్‌ సహవ్యవస్థాపకులు సచిన్‌ బన్సాల్‌, నాస్కామ్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌, కల్లారీ క్యాపిటల్‌ ఎండీ వాణి కోలాతో పాటు చివరి రోజు సమావేశాల్లో డీఆర్‌డీవో డైరెక్టర్‌ టెస్సీ థామస్‌, నిటి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, గోల్డ్‌ మెన్‌ శాక్స్‌ జపాక్‌ కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంకుర్‌ సాహూ, టీ-హబ్‌ సీఈవో జైకృష్ణ తదితరులు పాల్గొననున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat