అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశం..ఇవాంకా – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశం..ఇవాంకా

అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశం..ఇవాంకా

వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా.. హైదరాబాద్‌పై ప్రశంసలు కురిపించారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఇండియా, అమెరికా మధ్య బంధం బలోపేతమవుతున్నదని ఇవాంకా వెల్లడించారు.అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశమని,భారత్‌కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది సదస్సు జరుగుతున్నదని, ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు శుభాకాంక్షలు అని ఇవాంకా అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని ఇవాంకా అన్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ సెంటర్లు వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని కూడా మించిపోయే స్థాయికి చేరుతాయని ఆమె కొనియాడారు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అన్నారు.హైదరాబాద్‌లాంటి పురాతన నగరం.. ఇప్పుడు టెక్నాలజీ హబ్‌గా ఎదగడం చాలా గొప్ప విషయం అని ఇవాంకా అన్నారు. తొలిసారి ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్‌లో 1500 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొనడం చాలా గర్వంగా ఉందని చెప్పారు.