Home / MOVIES / జ‌బ‌ర్ద‌స్త్ బూతుపురాణం మ‌రో షోకి సోకింది.. అది ఇదే..!!

జ‌బ‌ర్ద‌స్త్ బూతుపురాణం మ‌రో షోకి సోకింది.. అది ఇదే..!!

ప్రోమో.. అంత‌కు ముందు కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈ ప‌దం.. ఇప్పుడు బుల్లితెరకు కూడా పాకింది. ఈ ప్రోమోల ల‌క్ష్యం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించ‌డ‌మే. ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించి… థియేట‌ర్ వ‌ర‌కు ర‌ప్పిండం, లేదా ఆ స‌మ‌యానికి టీవీ ఆన్‌చేసి ప్రోగ్రామ్ చూసేలా చేయ‌డ‌మే ప్రోమో ల‌క్ష్యం. ఈ విధానాన్ని ఇప్పుడు అంద‌రూ ఫాలో అవుతున్నార‌న్న విష‌యం తెలిసిందే.

బుల్లి తెర‌పై వ‌స్తున్న ప్రోగ్రామ్స్ ప్రోమోల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రోమో నిండా అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం లేదా, రియాక్ష‌న్స్ నింపేస్తున్నారు. అందులో చెప్పుకోవాల్సిన లిస్టులో ముందుగా జ‌బ‌ర్ద‌స్త్ ఉండ‌గా.. రెండు స్థానంలో ఢీ ఉందంటున్నారు సినీ జ‌నాలు. పాటిస్పేట్స్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌న‌లు, గొడ‌వ‌లు, లేదా ఆ షోల‌కు న్యాయ నిర్ణీత‌లుగా వ‌చ్చిన వారు పాటిస్పేట్స్‌పై ఫైర్ అవ‌డం వంటి సీన్స్ క‌ట్‌చేసి మ‌రీ అక్క‌డ‌క్క‌డా బూతు పురాణం నింపి ప్రోమోను రిలీజ్ చేసేస్తున్నారు.

ఇటీవ‌ల కాలంలో బూతు పురాణం జ‌బ‌ర్ద‌స్త్ కే కాకుండా.. ఢీ ప్రోగ్రామ్‌కు కూడా సోకింది. ఇందుకు కార‌ణం.. తాజాగా ఢీ ప్రోగ్రామ్ యూనిట్ విడుద‌ల చేసిన ప్రోమోనే.

ఏదో సంద‌ర్భంలో సుడిగాలి స‌ధీర్.. తీసుకొచ్చి ఇవ్వు డ‌బ్బులు ర‌ష్మీతో అన‌గా.. వ‌చ్చి నువ్వు తీసుకో అంటూ ర‌ష్మీ స‌మాధానం ఇస్తుంది. ఆ వెంట‌నే డోన్ట్ షో ఆఫ్ యువ‌ర్ యాటిట్యూడ్ అంటూ సుధీర్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడు అంటూ ర‌ష్మీ, ప్ర‌తీ సారి మేమొచ్చి ఇస్తున్నాం.. రావ‌డానికేంటి నీకు నొప్పి అంటూ సుధీర్ అన‌డం చూస్తుంటే.. ఢీ షో కాస్తా జ‌బ‌ర్ద‌స్త్‌ను మించి పోయిందే అంటూ చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat