వాట్సాప్ నుండి మ‌రో న‌యా ఫీచ‌ర్..! – Dharuvu
Breaking News
Home / TECHNOLOGY / వాట్సాప్ నుండి మ‌రో న‌యా ఫీచ‌ర్..!

వాట్సాప్ నుండి మ‌రో న‌యా ఫీచ‌ర్..!

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ను తమ వినియోగదారుల‌కు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మ‌రో స‌రికొత్త‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌లోనే చూసే అవ‌కాశం క‌ల్పించారు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

చాట్‌లో భాగంగా ఏదైనా యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పంపిస్తే ఇక ఆ వీడియోను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. ఆ వీడియోను చూస్తూ చాట్ కూడా చేసుకోవ‌చ్చు. ఇతర చాట్‌లోకి కూడా వెళ్లవచ్చు. గతంలో ఎవరైనా పంపిన యూట్యూబ్‌ వీడియో లింక్‌ను క్లిక్‌ చేస్తే అది యూట్యూబ్‌ యాప్‌లోకి వెళ్లి ప్లే అయ్యేది. దీంతో వాట్సాప్‌ నుంచి యూజర్‌ యూట్యూబ్‌కు వెళ్లాల్సివచ్చేది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేరుగా సంభాషణల మధ్యలోనే వీడియోను చూసుకునే సదుపాయం లభించనుంది.