ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్ – Dharuvu
Breaking News
Home / SLIDER / ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్

ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్

ఆపిల్‌ ఫేవరెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయ౦. అమెజాన్‌ తన ప్లాట్‌ఫామ్‌పై ఐఫోన్‌ ఫెస్ట్‌కు తెరతీసింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. నవంబర్‌ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌, డిసెంబర్‌ 9 వరకు ఈ ఫెస్ట్‌ జరుగనుంది.ముఖ్యంగా ఐఫోన్‌ 7, ఐఫోన్‌ ఎస్‌ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రవేశపెట్టింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఈ ఐఫోన్లు కొనుగోలు చేసిన వారికి ప్రమోషనల్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంచింది. అమెజాన్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ 32జీబీ వేరియంట్‌ రూ.20,000కే లిస్టు అయింది. దీన్ని అమెజాన్‌ అసలు రూ.26వేలకు విక్రయిస్తోంది. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరో రూ.2000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తుంది. దీంతో ఐఫోన్‌ ఎస్‌ఈ కస్టమర్లకు రూ.18వేలకే అందుబాటులోకి వచ్చింది.

డిస్కౌంట్‌ అనంతరం ఇతర ఐఫోన్ల ధరలు
ఐఫోన్‌ 7ను రూ.41వేలకు విక్రయిస్తోంది
ఐఫోన్‌ 6 ఎస్‌ను రూ.35వేలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఫోన్‌ 6 ధర రూ.26వేలుగా ఉంది
ఐఫోన్‌ 8 ప్లస్‌ 64జీబీ వేరియంట్‌ను రూ.69,685కు అందుబాటులోకి తీసుకొచ్చింది
ఐఫోన్‌ 8 64జీబీ వేరియంట్‌ను రూ.58,999కు విక్రయం
ఇలా అన్ని ఐఫోన్‌ మోడల్స్‌పైనా అమెజాన్‌ డిస్కౌంట్లను ప్రకటించింది.