Home / SLIDER / అందులో మంత్రి కేటీఆర్ పాత్ర సూపర్

అందులో మంత్రి కేటీఆర్ పాత్ర సూపర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో మూడురోజుల పటు జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతమైందని అమెరికన్ హిందూ కొయలేషన్ (ఏహెచ్‌సీ) ప్రకటించింది.ఈ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉందని, సదస్సుకు ఆమెరికా ప్రతినిధులుగా తెలుగువారు హాజరయ్యారని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లుచేయడంపై ఏహెచ్‌సీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాంకాట్రంప్ పాల్గొన్న చర్చాగోష్ఠికి తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా వ్యవహరించడం సదస్సుకే హైలైట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. సదస్సులో సభ్యులు ఆయా అంశాలపై తమ ఆలోచలనలను పంచుకున్నారన్నారు.