రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.2 కోట్లతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎస్సీల కోసం మూడున్నరేళ్లలో రూ.17వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీల కోసం ఒకేసారి 30 మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.