ఎంత వేగంతో చేస్తున్నారో..ఎంత సేపు చేశారో..ఇంకా మరెన్నో ఈ కండోమ్ ప్రత్యేకతలు – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / ఎంత వేగంతో చేస్తున్నారో..ఎంత సేపు చేశారో..ఇంకా మరెన్నో ఈ కండోమ్ ప్రత్యేకతలు

ఎంత వేగంతో చేస్తున్నారో..ఎంత సేపు చేశారో..ఇంకా మరెన్నో ఈ కండోమ్ ప్రత్యేకతలు

మార్కెట్లోకి కొత్త సరకు వచ్చింది. అదే స్మార్ట్ కండోమ్! ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, చూడండి. చాలామందికి తమ సెక్స్ సామర్థ్యంపై చాలా అనుమానం ఉంటుంది. అలాంటివారికి ఈ స్మార్ట్ కండోమ్ భలే నచ్చేస్తుంది.
బ్రిటన్‌కు చెందిన కండోమ్ సంస్థ ఐ.కాన్ (i.Con) అనే స్మార్ట్ కండోమ్‌ను రూపొందించింది. ఇది అన్ని సైజుల్లోనూ లభిస్తుంది. దీన్ని పెట్టుకుంటే మీ సెక్స్ జీవితం జింగాడాలా అంటూ ఆ సంస్థ ప్రకటిస్తోంది. అంతేగాక ఐ.కాన్ సాధారణ కండోమ్‌ల్లా ఉండదు. ఇది రింగు ఆకారంలో ఉంటుంది. దీన్ని కండోమ్‌పైన ధరించాలి. ఇందులో నానో చిప్స్‌తో పాటు సెన్సార్లు కూడా ఉంటాయి. బ్యాటరీ ఛార్జింగ్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్ట్ కేబుల్ కూడా ఇచ్చారు. దీన్ని బ్లూతూత్ ద్వారా మీ స్మార్ట్‌కు అనుసంధానం చేసుకోవాలి. దీన్ని రబ్బరుతో తయారు చేశారు. దీనివల్ల ఏ ‘సైజు’కైనా సరిగ్గా సరిపోతుంది. సెక్స్ చేస్తున్న సమయంలో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని ఎన్నిసార్లయినా వాడవచ్చు.

దీని పనితీరు విషయానికి వస్తే, ఇది పురుషాంగం చుట్టుకొలతతో పాటు.. ఎంత వేగంతో సెక్స్ చేస్తున్నారో కూడా చెప్పేస్తుంది. సెక్స్ సమయంలో శరీరక ఉష్ణోగ్రత, ఎన్ని కెలోరీలు ఖర్చయ్యాయి, ఎంత సేపు చేశారు, ఏయే భంగిమల్లో చేశారు వంటి సమాచారమంతా చెబుతుంది. ఈ వివరాలు స్మార్ట్ కండోమ్‌లో ఉండే బ్లూతూత్.. స్మార్ట్ ఫోన్ మొబైల్‌కు పంపుతుంది.

ఇందుకు మీ స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్ కండోమ్‌తో పెయిర్ చేసుకోవాలి. సో, మీ సెక్స్ సామర్థ్యం గురించి ఏమైనా అనుమానాలు ఉండి ఉంటే ఈ కండోమ్ వాడి తెలుసుకోవచ్చు. తర్వాతి కలయికలో మరింత మెరుగైన సామర్థ్యం ప్రదర్శించేందుకు సన్నధం కావచ్చు. ఈ కండోమ్ విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.5వేలు ఉంది. అయితే, ఇది ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే లభిస్తున్నాయి.