Home / NATIONAL / డబ్బులు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన అధికార పార్టీ ఎమ్మెల్యే

డబ్బులు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన అధికార పార్టీ ఎమ్మెల్యే

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోట్ల కట్టలు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన సంఘటన ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది . తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కనకరాజ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ జయంతి ఉత్సవాలకు హాజరు కావల్సింది గా జనాలకు ఆదేశాలను జారీచేశారు .

అయితే ఊరికినే కాకుండా నోట్లు ,మద్యం పంపిణీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు .తీసుకున్నది తడవు సుమారు అరవై బస్సులలో జనాలను ఆ ఉత్సవాలకు తరలించాడు .

ఈ క్రమంలో హాజరు కావడానికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడమే కాకుండా క్వార్ట్రర్ బాటిల్ పంపిణీ చేశాడు సదరు ఎమ్మెల్యే .ఈ క్రమంలో ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ ..మద్యం పంపిణీ చేస్తూ ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ వీడియోలో ఎమ్మెల్యే పక్కన మద్యం బాటిల్స్ ఉన్న విషయం కూడా అందులో స్పష్టంగా కనిపిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat