13న ”ధోనీ రిటైర్మెంట్‌”..! – Dharuvu
Breaking News
Home / SPORTS / 13న ”ధోనీ రిటైర్మెంట్‌”..!

13న ”ధోనీ రిటైర్మెంట్‌”..!

ధోనీ రిటైర్మెంట్.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఈ నెల 13వ‌ తేదీ నుంచి క్రికెట్ గ్రౌండ్‌కు త‌న‌కు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు ధోనీ. ఇన్నాళ్ల‌పాటు క్రికెట్‌కు ఎన‌లేని సేవ‌లు అందించిన ధోనీ హ‌ఠాత్తుగా త‌న రిట‌ర్మైంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించేశాడు. ఇందుకు సంబంధించి సంబంధిత యంత్రాంగం ధోనీకి వీడ్కోలు ప‌లికేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ఇక్క‌డ ఓ ట్విస్ట్ ఉందండి బాబూ.. మీరు అనుకున్న‌ట్టు ఈ నెల 13న రిటైర్మంట్ తీసుకోబోయేది టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ కాదండి బాబోయ్‌.. దోని అనే పేరుగ‌ల స్నిఫ‌ర్ డాగ్‌.

ఇక స్నిఫ‌ర్ డాగ్ విష‌యానికొస్తే.. గ‌త ప‌దేళ్ల క్రితం మొహాలీ క్రికెట్ స్టేడియంలో భ‌ద్ర‌తా విభాగంలో సేవ‌లు అందించేందుకు వ‌చ్చింది. అప్ప‌ట్లోనే ఈ డాగ్‌కు ధోనీ అని నామ‌క‌ర‌ణం చేశారు అధికారులు. ధోనీ పేరుతో గ‌త ప‌దేళ్ల నుంచి మొహాలీ క్రికెట్ స్టేడియం భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో పాలుపంచుకుంటూ వ‌స్తోంది. అయితే, ప్ర‌స్తుతం ధోనీకి రిటైర్మెంట్ సమ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. అందులో భాగంగానే ఈ నెల 13న ధోనీకి వీడ్కోలు ప‌ల‌క‌నున్నారు అధికారులు. అలాగే, ధోనీతోపాటు మ‌రో రెండు జాగిలాలు జాన్, ప్రీతి కూడా క్రికెట్ సేవ‌ల నుంచి విశ్ర‌మించ‌బోతున్నాయి.