హైదరాబాద్‌ హాస్టల్‌ లో దంత వైద్యురాలు ఆత్మహత్య…..కారణం ఇదే – Dharuvu
Breaking News
Home / CRIME / హైదరాబాద్‌ హాస్టల్‌ లో దంత వైద్యురాలు ఆత్మహత్య…..కారణం ఇదే

హైదరాబాద్‌ హాస్టల్‌ లో దంత వైద్యురాలు ఆత్మహత్య…..కారణం ఇదే

యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాగ్య నగరంలోని చైతన్యపురిలో గీతాకృష్ణ అనే దంత వైద్యురాలు ఆత్మహత్యకు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన నరేష్‌ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె ఓ ప్రైవేట్‌ హాస్టల్‌ లో ఉంటోంది. అమె మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బలవన్మరణానికి ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఆపై ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. ఈ యువ వైద్యురాలిది జగిత్యాల జిల్లా. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. గీతాకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

.