39ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ .. – Dharuvu
Breaking News
Home / SPORTS / 39ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ ..

39ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ ..

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు .దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో దాదాపు 39 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు .ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కల్పి రెండు వందల తొంబై మూడు పరుగులు చేశాడు కోహ్లీ .

దీంతో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన టీం ఇండియా ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు .ఇప్పటివరకు మొదటిస్థానంలో ఉన్న టీం ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (289)పరుగుల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు .అప్పుడు గవాస్కర్ తోలి ఇన్నింగ్స్ లో 107 ,రెండో ఇన్నింగ్స్ లో 182 పరుగులు చేశాడు .ప్రస్తుతం కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 243,రెండో ఇన్నింగ్స్ లో 50 పరుగులు చేశాడు .