ప‌డుకునేందుకు ర‌మ్మంటున్నారు.. మ‌రో హీరోయిన్ సంచ‌ల‌నం..!! – Dharuvu
Breaking News
Home / MOVIES / ప‌డుకునేందుకు ర‌మ్మంటున్నారు.. మ‌రో హీరోయిన్ సంచ‌ల‌నం..!!

ప‌డుకునేందుకు ర‌మ్మంటున్నారు.. మ‌రో హీరోయిన్ సంచ‌ల‌నం..!!

కోలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెర‌కు షిప్ట్ అయిన న‌టీమ‌ణుల్లో ఐశ్వర్యా రాజేష్ ఒక‌రు. అడ్డ క‌త్తి, కాకు ముట్టాయ్‌, ర‌మ్మీ వంటి వ‌రుస సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించింది ఈ భామ‌. చూడ‌గానే ఆక‌ర్షించే క‌ళ్లు, చ‌క్క‌టి అభిన‌యం, ప‌ర్‌ఫెక్ట్ బాడీ షేప్ ఐశ్వ‌ర్యా రాజేష్ సొంత‌మ‌ని అంటుంటారు త‌మిళ తంబీలు. ఒకానొక స‌మ‌యంలో స‌న్‌టీవీలో టెలికాస్ట్ అయిన ఓ ప్రోగ్రాం ద్వారా సినీ అభిమానుల్లో మాంచి క్రేజ్ సంపాదించి వెండితెర‌మీద‌ అడుగుపెట్టిన ఈ యువ హీరోయిన్‌కు కూడా వేధింపులు త‌ప్ప‌లేద‌ట‌.

ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది ఐశ్వ‌ర్యా రాజేష్‌. తాను వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన రోజుల్లో బాలీవుడ్‌లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నించాన‌ని, ఆ ప్ర‌య‌త్నంలో త‌న‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయంటూ చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యం త‌న‌పై చేతులు వేస్తూ.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేతులు వేస్తూ.. ప‌డుకోవ‌డానికి ఎప్పుడొస్తావంటూ అడిగార‌ని, ఇప్ప‌టికీ వేరే నెంబ‌ర్ల నుంచి ఫోన్లు వ‌స్తున్నాయ‌ని త‌న చేదు అనుభ‌వాల‌ను ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది ఐశ్వ‌ర్యా రాజేష్‌.