”చూపించేకొద్దీ… పెరుగుతున్నాయ‌ట‌” – Dharuvu
Home / MOVIES / ”చూపించేకొద్దీ… పెరుగుతున్నాయ‌ట‌”

”చూపించేకొద్దీ… పెరుగుతున్నాయ‌ట‌”

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినీ ఇండ‌స్ర్టీలో రాణించాలంటే న‌ట‌న‌, అభిన‌యంతోపాటు గ్లామ‌ర్ త‌ప్ప‌నిస‌రి. అందాల ఆర‌బోత ఉంటేనే అవ‌కాశం అన్న రీతిగా త‌యారైంది సినీ ఇండ‌స్ర్టీ. అందుకు త‌గ్గ‌ట్టుగానే వెండితెర‌పై అడుగుపెట్ట‌క‌ముందే రెడీ అయి వ‌స్తున్నారు కొత్త భామ‌లు.

అయితే, ప్ర‌స్తుతం ఆ జాబితాలో యువ‌కుల క‌ల‌ల‌రాణి మెహ్రీన్ కౌర్ కూడా ఆ జాబితాలో చేరి పోయింది. మొద‌టి సినిమా కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లో అంత‌గా అందాల‌ను ఆర‌బోయ‌క‌పోయినా త‌రువాత వ‌చ్చిన మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల‌తో హ్యాట్రిక్ విజయాలు సాధించ‌డంతోపాటు అందాల డోస్‌ను పెంచుతూ వ‌చ్చింది. దీంతో నిర్మాత‌లకు కాసుల వ‌ర్షం, మెహ్రీన్‌కు రెమ్యున‌రేష‌న్‌తోపాటు పిచ్చ క్రేజ్ వ‌చ్చేసింది. ఆ త‌రువాత వ‌చ్చిన కేరాఫ్ సూర్య మూవీలో కూడా మెహ్రీన్ రెచ్చిపోయింది.

అయితే, ఇటీవ‌ల రిలీజై హిట్ టాక్‌తో, మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ దూసుకుపోతున్న జ‌వాన్ మూవీలో అయితే మెహ్రీన్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. యువ‌త చ‌ర్చ‌ల్లో భాగ‌మైపోయేంత‌లా త‌న అందాల‌ను జ‌వాన్ సినిమాలో వ‌డ్డించింది మెహ్రీన్ కౌర్‌. మెహ్రీన్ కౌర్‌పై కాస్తా గోల్డెన్ లెగ్ భామ ముద్ర ప‌డ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు మెహ్రీన్ డేట్స్ కోసం క్యూ క‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ హాట్ భామ గోపీచంద్ హీరోగా చ‌క్రి తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే… మెహ్రీన్ త‌న అందాల‌ను చూపించే కొద్దీ.. అవ‌కాశాలు వాటంత‌ట అవే పెరుగుతున్నాయంటూ చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు.