మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ .. – Dharuvu
Breaking News
Home / SLIDER / మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చే సమస్యలపైన స్పాట్ లో స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల వెంకట్ రెడ్డిని సొంత కొడుకులు కసాయి గా మారటం అనే కథనాన్ని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లో చూసి మంత్రి హరీష్ రావు చలించిపోయారు .

వెంటనే మంత్రి తన ఓఎస్డీ అయిన బాలరాజు ను ,అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మని వారి గురించి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కారించాలని ఆదేశించారు…దీంతో ఓఎస్డీ బాల్ రాజ్ గారు ,రాధాకృష్ణ శర్మ చంద్లపూర్ గ్రామంలో వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.. కన్న తండ్రికి కసాయి గా మారిన వారి కుమారులు భూంరెడ్డి ,బాపిరెడ్డి లను పిలిపించారు…వారితో మాట్లాడి సంరక్షణ బాధ్యత తీస్కువాలి వారికి చెప్పడం జరిగింది ..

దానికి వారు అంగీకరిస్తూ ఇద్దరు కుమారులు ఒప్పుకున్నారు…అందులో చిన్న కుమారుడు బాపిరెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి సంరక్షణ పూర్తి బాధ్యత తీసుకుంటానని గ్రామ సర్పంచ్ భద్రయ్య ,ఎంపీటీసీ చంద్రమౌళి ,గ్రామ ఇతర గ్రామ పెద్దల సమక్షంలో అంగీకారాన్ని తెలియజేశారు..మంత్రి హరీష్ రావు చొరవతో 80ఏళ్ల వయస్సు గల వృద్ధునికి సంరక్షణ కల్పించడం పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు… ప్రజాప్రతినిధుని బాధ్యత గా…ఒక తండ్రి కి కొడుకులా…. సిద్దిపేట ప్రజలే కుటుంబ సభ్యులగా భావించి తన మానవత్వాన్నీ చాటుకున్నారు మంత్రి హరీష్ రావు అని అభినందనల వర్షం కురిపిస్తున్నారు .