వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. – Dharuvu
Breaking News
Home / TELANGANA / వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అద్యక్షతన జరుగుతున్న పవర్ ,నూతన ఉత్పాదకత సదస్సు జరుగుతుంది . ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , అజయ్ మిశ్రా తో పాటూ వివిధ రాష్ట్రాల మంత్రులు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తునట్లు చెప్పారు . దేశంలో పగటిపూట వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేసారు .సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని మంత్రి తెలిపారు.