జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు … – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు …

జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు …

ప్రముఖ టాలీవుడ్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరిజిల్లాలకు చెందిన జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ,తన అభిమానులతో సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన కార్యకర్తలకు పలు అంశాలపై మార్గదర్శకం చేశారు .

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు .పవన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీరాలంటే ముఖ్యమంత్రి కావాలి .అందుకు మీ ఆశీర్వాదం ..దేవుడి దీవెనలు కావాలి అని జగన్ అడుగుతున్నారు .

ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సమస్యలను తీరుస్తారా ..?.ముఖ్యమంత్రి కాకపోతే ప్రజల సమస్యలను తీర్చరా ..ఇలాంటి దోరణికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన జగన్ కు హితవు పలికారు .అంతే కాకుండా ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలలో తిరిగితే కారు అని ఆయన జగన్ పాదయాత్రను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ..