పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్‌..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్‌..!

పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్‌..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేను యేండ్ల పాటు ఆయన ఆర్ధికంగా అండగా ఉన్న సీనియర్ నాయకుడు .పార్టీ దాదాపు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న కానీ ఆర్ధికంగా అండదండలు అందిస్తూ ..బాబుకు అన్నివిధాలుగా సహాయసహకారాలను అందించిన సీనియర్ మాజీ ఎంపీ ..అంతే కాదు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త .ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన చంద్రబాబుకు కుడి భుజం .ఇంతకు ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారా ..?.ఆయనే ప్రముఖ పారిశ్రామికవేత్త ,మధుకాన్ సంస్థల అధినేత ,ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు .

ఆయన త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఆయన చంద్రబాబుకు ఎంత నమ్మకస్తుడో ఇరు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు .ఒకానొక సమయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఖమ్మం పొలిటికల్స్ ను శాసించిన ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను వదులుకోవడానికి కూడా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు నామా బాబుకు ఎంత ఇష్టమైన ఆర్ధిక వనరులను సమకూర్చే అనుచరుడు అని .అయితే తుమ్మలకు చెక్ పెడదామని బాబే స్వయంగా నామాను రంగంలోకి దింపిన కానీ తుమ్మలకు ప్రజలలో ఉన్న అభిమానం ,ఆదరణ ముందు నామా ,బాబు ఇరువురు తట్టుకోలేకపోయారు .

అయితే ప్రస్తుతం నవ్యాంధ్ర రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను చూస్తున్న నామా బాబుకు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు అని జిల్లా రాజకీయాల్లో కోడై కూస్తున్నాయి .ఇప్పట్లో కనుచూపు మేరా టీడీపీ తెలంగాణలో బ్రతికిబట్ట కట్టని పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన ఆలోచిస్తున్నారు అని సమాచారం .అయితే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి లోక్ సభ ఎంపీగా పోటిచేయడానికి సీనియర్ ఎంపీ రేణుకా చౌదరి అంతగా ఆసక్తి చూపకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఖమ్మం స్థానాన్ని నామాకు ఇవ్వడానికి ఆసక్తి చూపడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు .అంతే కాకుండా పార్టీ మార్పుపై ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారు అని సమాచారం .అందుకు బాబు రొటీన్ గా ఉండేవారు ఉంటారు .పోయేవారు పోతారు అని తేలిగ్గా నామాకు బదులిచ్చారు అంట .దీంతో ఆయన తీవ్ర మనస్థాపం చెంది ఈ నిర్ణయానికి వచ్చారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..