జగనన్న పులి .పవన్ పిల్లి .రోజా సంచలన వ్యాఖ్యలు.. – Dharuvu
Home / ANDHRAPRADESH / జగనన్న పులి .పవన్ పిల్లి .రోజా సంచలన వ్యాఖ్యలు..

జగనన్న పులి .పవన్ పిల్లి .రోజా సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పుల వర్షం కురిపించారు .తనదైన స్టైల్ లో పవన్ పై సెటైర్ల వర్షం కురిపించారు .వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే రోజా మాట్లాడుతూ “ఒక్కసారి ఎంపీగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా బంపర్ మెజారిటీతో గెలవడమే కాకుండా ..పార్టీ పెట్టి సొంతంగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి .

పార్టీ పెట్టి ఫ్యాకేజీల కోసం .. చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసం పార్టీ పెట్టి పోటి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక పిల్లి అని ఆమె సంచలన వ్యాఖ్యలు .అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాకేజీ ఆర్టిస్ట్ అని ఆమె అన్నారు .ఆఖరికి తనకు సినిమా కెరీర్ ఇచ్చిన సొంత అన్న అయిన మెగాస్టార్ చిరంజీవిని మోసం చేసిన సిగ్గు ..శరం లేని వాడు పవన్ .

అసలు చిరును రాజకీయంగా ముంచినదే పవన్ .అంతే కాకుండా తన అన్నాను మోసం చేసిన పవన్ తనకు తను ముందు ప్రశ్నించుకోవాలని ఆమె సలహా ఇచ్చారు .అసలు చిరు వలనే సినిమాల్లోకి వచ్చాను అన్న సంగతి పవన్ కళ్యాణ్ మరిచిపోయి జగన్ గురించి మాట్లాడుతున్నారు అని ఆమె హేద్దేవా చేశారు .