ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి – Dharuvu
Breaking News
Home / CRIME /  ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి

 ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి

ఓ కేసు కోసం పోతే మరోక కేసు బయగపడింది… అది కూడ పోలీసులు షాక్ అయిన కేసు. వ్యభిచారం నిర్వహిస్తున్నావారిని
పట్టుకుందామని వెళ్లిన పోలీసులకు అంతకుమించి షాకింగ్‌ విషయం తెలిశాయి. సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళ ఓ హంతకురాలు అని కూడా గుర్తించి అవాక్కయ్యారు. గాలింపులు నిర్వహించిన పోలీసులకు అస్తిపంజరం లభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్తను 13 ఏళ్ల కిందటే హత్య చేసి సెప్టిక్‌ ట్యాంక్‌లో పెట్టినట్లు తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని బోయిసార్‌ ప్రాంతానికి చెందిన పోలీసులు ఫరిదా భారతీ అనే మహిళ ఇంట్లో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారం తెలుసుకొని దాడులు నిర్వహించారు.

నలుగురు మహిళలను ఆ ఊబిలో నుంచి బయటపడేశారు. ఆ తర్వాత మరోసారి గాలింపు చర్యలు చేపట్టగా సెప్టిక్‌ ట్యాంక్‌లో అస్తిపంజరం లభించింది. దానిపై విచారించగా ఆమె భర్తను హత్య చేసి అందులో పడేసినట్లు తెలిపింది. ‘ఫరిదా కేవలం వ్యభిచారం మాత్రమే కాకుండా తన భర్తతో సహా పలువురుని హత్య చేసిందన్న సమాచారం మేరకు మేము మంగళవారం రైడింగ్‌ నిర్వహించాం. అక్కడ మాకు అస్తిపంజరం లభించింది. ఆమెను విచారించగా సహదేవ్‌ అనే తన భర్తను 13 ఏళ్ల కిందటే చంపి అందులో పాతిపెట్టినట్లు తెలిపింది. నిద్రపోతున్న భర్తను తలపై కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది’ అని పోలీసులు తెలిపారు.