కాలు జారిన తమన్నా… ఏంతో అవమానం – Dharuvu
Breaking News
Home / MOVIES / కాలు జారిన తమన్నా… ఏంతో అవమానం

కాలు జారిన తమన్నా… ఏంతో అవమానం

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో న‌టించి ప్రతి ఇండ‌స్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. టాప్ మూవీస్‌లో న‌టించ‌డ‌మే కాకుండా.. టాప్ హీరోస్‌తో సైతం న‌టించ‌డం త‌మ‌న్నా సొంతం. అయితే, న‌టిగా కాకుండా మోడ‌ల్‌గా త‌మ‌న్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కార‌ణం త‌మ‌న్నా నూటికి నూరుశాతం బ్యూటీని క‌లిగి ఉండ‌ట‌మే.అయితే తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే కారణం. హైహీల్స్ వేసుకుని నడవలేక పాపం కాంద పడిపోయింది. అంతేగాక ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్‌ను ఓ వైపు లాక్కుంటూ.. కింద పడి లేస్తూ ఇబ్బందికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నడవలేక తమన్నా పడిన పాట్లు చూసి అభిమానులు కేకలేశారు. చివరికి తమన్నా స్టేజ్ నుంచి కింద పడుతూ లేస్తూ దిగిపోయింది.